దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్|
అయోధ్యాం ప్రస్థితో రామ: పుష్పకేణ సుహృద్వృత: || (86)
యుద్ధమున, తన విజయమును చూసి ప్రశంసించుటకు వచ్చిన దేవతలు వరమీయగా, ఆ వరముచే యుద్ధమున మరణించిన వానర వీరులందరినీ మరలా బ్రతికించి, రావణాసురుడు కుబేరుని వద్ద గెలిచిన పుష్పకవిమానముపై మిత్రులగు సుగ్రీవ, విభీషణులతో కలిసి రాముడు అయోధ్యకు బయలుదేరెను.
భరద్వాజాశ్రమం గత్వా రామ: సత్యపరాక్రమ:|
భరత స్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్|| (87)
రాముడు, భరద్వాజ ముని ఆశ్రమానికి చేరి, భరద్వాజుడు రాముని నాడు అచట ఉండవలసినది అని కోరగా, తాను భరతునికి ఇచ్చిన మాత ప్రకారం వనవాసము చివరిరోజున అయోధ్యకు వెళ్లకుంటే, భరతుడు అగ్నిప్రవేశము చేసెదడని, భరతుని వారించమని హనుమంతుని భరతునివద్దకు పంపెను.
పున రాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ స:|
పుష్పకం తత్ సమారుహ్య నందిగ్రామం యయౌ తదా|| (88)
అటు పిమ్మట సుగ్రీవ విభీషణాదులతో కలిసి పుష్పక విమానమెక్కి సీతకు, తక్కినవారికి పూర్వ విశేషములను తెలుపుతూ, తాను భరతుడు ఉన్న నందిగ్రామమునకు పయనమాయెను.
నందిగ్రామే జటా హిత్వా భ్రాతృభి: సహితోనఘ:|
రామస్సీతా మనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ || (89)
రాముడు నందిగ్రామమునకు చేరుకొని, సోదరులందరినీ కలసికొని జడలను తీసెవేసి, సీతాసమేతుడై పూర్వము తన తండ్రి ఐన దశరధుడు ఇచ్చిన రాజ్యమును , వనవాసము తరువాత మరలా స్వీకరించెను.
ప్రహృష్టో ముదితో లోక స్తుష్ట: పుష్ట: సుధార్మిక:|
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జిత: || (90)
రామవియోగముతో అలమటించిన అయోధ్యా ప్రజలు, రామ పట్టాభిషేకముతో మహదానందభరితులై, రామునకు కడు ప్రియమైన ధర్మ మార్గమును అనుసరించుచు, ఎటువంటి మానసిక, శారిరక వ్యాధులు లేనివారై, కరువు భయము లేనివారై ఆనందముగా జీవించసాగెను.
వాల్మీకి రామాయణము
Ramayanam in one painting by Bapu

Wednesday, March 19, 2014
Tuesday, March 18, 2014
బాలకాండ శ్లోకాలు: 81-85 (ప్రథమ సర్గ)
తేన గత్వా పురీం లంకాం హత్వా రావణ మాహవే|
రామ స్సీతా మనుప్రాప్య పరాం వ్రీడా ముపాగమత్|| (81)
ఆ సేతుమార్గమున రాముడు లంకా నగరానికి చేరి, యుద్ధంలో రావణుని చంపి, సీతను సమీపించి, "ఇంత కాలం పరుని ఇంట ఉన్న ఈమెను స్వీకరించుట యెట్లు" అని సిగ్గుపడెను.
తా మువాచ తతో రామ: పరుషం జనసంసది|
అమృష్యమానా సా సీతా వివేశ జ్వలనం సతీ|| (82)
పిమ్మట, రాముడు జనసమూహమున సీతతో పరుషముగా మాట్లడగా, మహా పతివ్రత ఐనటువంటి సీత, పరుషమైన రాముని వాక్యములకు మిక్కిలి బాధపడి, అగ్నిప్రవేశము చేసెను.
తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం|
బభౌ రామ: సంప్రహృష్ట: పూజిత: సర్వదైవతై: || (83)
సీత అగ్నిప్రవేశము చేసిన పిమ్మట, అగ్ని పలికిన మాటలచే సీత యే దోషమునూ లేనిదని గుర్తించి, సర్వదేవతలు తన ధర్మనిరతిని పొగడగా, రాముడు ఆనందించెను.
కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం |
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మన: || (84)
ప్రశంసార్హమగు రావణవధ చేసిన రాముని ముల్లోకములోనున్న సర్వదేవతలు, ఋషులు, అందరు ఆనందించిరి.
అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం|
కృతకృత్యస్తదా రామో విజ్వర: ప్రముమోద హ|| (85)
అటుపిమ్మట, రాముడు విభీషణుని లంకాపురిలో రాక్షసరాజుగా అభిషిక్తుని చేసి, తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని, కృతకృత్యుడై, ఆనందించెను.

Saturday, March 15, 2014
బాలకాండ శ్లోకాలు: 76-80 (ప్రథమ సర్గ)
అస్త్రే ణోన్ముక్త మాత్మానం జ్ఞాత్వా పైతామహా ద్వరాత్ |
మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణ స్తాన్ యదృఛ్ఛయా || (76)
తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం|
రామాయ ప్రియ మాఖ్యాతుం పునరాయా న్మహాకపి: || (77)
దేవతలకు కూడా ప్రవేశించుటకు అసాధ్యమైనటువంటి లంకా నగరములోకి, అతి పరాక్రమశాలి ఐనటువంటి హనుమంతుడు, బ్రహ్మదేవుని వరముచే రాక్షసులు ప్రయోచిన బ్రహ్మాస్త్రము విడిపోయినను, రావణుని చూచుటకై, రాక్షసులు వీధులవెంట ఈడ్చుకుపోతున్ననూ, మిన్నకుండెను.అటుపిమ్మట రావణుని చూచి, మరలిపోవుచూ, సీత నివసించుచున్న వనము విడిచి, మిగిలిన లంకాపురమును తగులబెట్టి, రామునకు సీతను చూచిన శుభవార్తను తెలుపుటకు మరలెను.
సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం|
న్యవేదయ దమేయాత్మా దృష్టా సీతేతి తత్వత:|| (78)
మహాబుద్ధిమంతుడైన హనుమంతుడు, సీతావియోగమునందు కూడా, ధైర్యము వీడని రాముని దరికి జేరి, ప్రదక్షిణమాచరించి , "చూచితి సీత"నను శుభవార్తను విన్నవించెను.
తత: సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధే:|
సముద్రం క్షోభయామాస శరై రాదిత్యసన్నిభై: || (79)
హనుమంతుడు, సీత యొక్క జాడను తెలిపిన పిమ్మట, రాముడు సుగ్రీవసహితుడై సముద్ర తీరమునకేతెంచెను. అచ్చట, సముద్రుడు దారి చేయకుండుతచే రాముడు కోపించి, సూర్య కాంతి పోలిన బాణములతో సముద్రుని బెదిరించెను.
దర్శయామాస చాత్మానం సముద్ర: సరితాం పతి:|
సముద్రవచనాచ్చైవ నలం సేతు మకారయత్|| (80)
నదీపతి యగు సముద్రుడు, రాముని కోపమునకు బెదిరి తన నిజరూపముతో ప్రత్యక్షమై, రాముని శరణు వేడెను. రాముదు, సముద్రునిపై దయ తలచి, తన అస్త్రాలను ఉపసమ్హరించి, నలుడను ఒక వానర శ్రేష్ఠునితో సముద్రముపై వారధి నిర్మింపజేసెను.

Thursday, March 13, 2014
బాలకాండ శ్లోకాలు: 71-75 (ప్రథమ సర్గ)
స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభ:|
దిశ:ప్రస్థాపయామాస దిదృక్షు:జనకాత్మజాం || (71)
వానరులందరికీ రాజైనటువంటి సుగ్రీవుడు, వానరసెనలను నలుదిక్కులకు పంపెను, జనకుని కూతురైన సీత ను వెదకుటకై.
తతో గృధ్రస్య వచనాత్ సంపాతే ర్హనుమాన్ బలీ|
శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం || (72)
అటు పిమ్మట, జటాయు యొక్క అన్నగారైన సంపాతి చెప్పిన సమాచారం విన్న, సర్వ సమర్ధుడైన హనుమంతుడు, వంద యోజనముల సముద్రమును దాటుటకు ఆకాశమునకెగసెను.
తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం|
దదర్శ సీతాం ధ్యాయంతీం, అశోకవనికాం గతాం|| (73)
హనుమంతుడు, రావణుడు పాలించుచున్న లంకా నగరానికి చేరి, అశోక వనములో, కేవలము రామ ధ్యానములో ఉన్న సీతా మాతను చూచెను.
నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ|
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం|| (74)
శ్రీరాముడు తనకిచ్చిన ఉంగరమును సీతాదేవికి గుర్తుగా ఇచ్చి, రామ-సుగ్రీవ మిత్రత్వము నుంచి, వానర సైన్యమును నలుదిశలకు సీతాన్వేషణకై పంపినవరకు గల వృత్తాంతమును సీతా మాత విన్నవించి, రాముడూ త్వరలోనే వచ్చి కాపాడునని సీతామాతను ఓదార్చి, అశోక వనముయొక్క వెలుపలి ద్వారమును చూర్ణము చేసెను.
పంచ సేనాగ్రగాన్ హత్వా సప్త మంత్రిసుతా నపి|
శూర మక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్|| (75)
పిమ్మట, హనుమంతుడు రావణుని ఐగుదురు సేనాపతులను, మంత్రి సుతులేడుగురిని చంపి, పరాక్రమవంతుడైన అక్షకుమారుని హతము చేసి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బద్ధుడయ్యెను.

Sunday, July 29, 2012
బాలకాండ శ్లోకాలు: 61-70 (ప్రథమ సర్గ)
చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం |
తతో వానర రాజేన వైరానుకధనం ప్రతి || ( 61)
రామునితో అగ్నిసాక్షిగా స్నేహమునకు అంగీకరించిన సుగ్రీవుడు, రాముడు చెప్పినదంతా విని, తనకు జరిగిన అన్యాయమును గురించి కూడా రామునికి చెప్పనారంభించెను. ( 61)
రామాయావేదితం సర్వం ప్రణయాదు:ఖితేన చ |
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి || (62)
తన సోదరుడైన వాలితో తనకు ఉన్న వైరము గురించి మొత్తం రామునకు సుగ్రీవుడు విన్నవించెను. ఈ వృత్తాంతం వినిన రాముడు, ఇన్ని దురాగతాలకు పాలుపడిన వాలిని వధించి సుగ్రీవునకు న్యాయము చేయుటకు ప్రతిజ్ఞ చేసెను. ( 62)
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానర: |
సుగ్రీవశ్శంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే|| (63)
ఇట్లు ప్రతిజ్ఞ చేసిన రామునితో, అక్కడ ఉన్న వానర సైన్యం వాలి యొక్క బల ప్రతాపాలను గూర్చి వివరించుటనారంభించెను. సుగ్రీవుడు, రాముని ధైర్య సాహసాలను తెలుసుకున్నను, వాలితో యుద్ధమునకు రాముడు తగిన వాడేనాయని శంకించెను. (63)
రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే: కాయముత్తమం|
దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం|| (64)
వాలియొక్క బలమును శ్రీ రామునకు నిరూపించుటకు సుగ్రీవుడు, రామునకు వాలి వధించిన దుందుభి అను రాక్షసుని కళేబరమును చూపించెను. ఆ కళేబరము చూచుటకు పర్వతమును పోలి ఉన్నది. (64)
ఉత్స్మయిత్వా మహాబాహు: ప్రేక్ష్య చాస్థిమహాబల: |
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం|| (65)
ఆ కళేబరమును చూసిన రఘురాముడు, సుగ్రీవునివైపు మందహాసముతో చూచి, ఆ కళేబరమును తన కాలి బొతనివేలితో కొట్టెను. ఆ దెబ్బకు ఆ కళేబరము పది యోజనముల దూరమ్న పడెను. ఇది చూచిన తరువాత కూడా రామునిపై సుగ్రీవునకు నమ్మకము కుదరలేదు. ( 65)
బిభేద చ పున: సాలాన్ సప్తేకైన మహేషుణా|
గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా|| (66)
సుగ్రీవుని నమ్మకమును పెంచుటకు, రాముడు, ఒకే ఒక్క బాణంతో ఏడు సాల వృక్షములను కొట్టెను. ఆ బాణము, వృక్షములను కొట్టుటయే కాక ఒక పర్వతములోనుంచి వెళ్ళి, పాతాళ లోకంలో దాకా వెళ్ళెను. (66)
తత: ప్రీతమనాస్తేన విశ్వస్త: స మహాకపి:|
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా|| (67)
రాముడు చేసిన పనిని చూసి సుగ్రీవుడు పొంగిపోయెను. రాముడీపైన తన నమ్మకం పెరిగెను. రాముని తో స్నేహము చేసినందుకు సంతోషించి, రామునితో కలిసి కిష్కింధలో తన గుహ దెగ్గరకు బయలుదేరెను. (67)
తతో గర్జత్ హరివర: సుగ్రీవో హేమపింగళ: |
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వర: || (68)
బంగారము వంటి తేజస్సు కలిగినటువంటి సుగ్రీవుడు, కిష్కింధకు చేరగానే, గర్జన చేయుచూ, వాలిని పిలిచెను. వానర రాజైనటువంటి వాలి, తన గుహలొనుంచి బయటకి వచ్చెను. (68)
అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగత: |
నిజఘాన చ తత్రైవం శరేణైకేన రాఘవ: || (69)
సుగ్రీవుని అరుపులు వినగానే, వాలి గుహనుంచి బయటకు బయలు దేరెను. కానీ,తన భార్య ఐన తార వాలిని వారించెను. సుగ్రీవుడు రామునితో వచి ఉండవచ్చునని, వరితో వైరం వాలికి మంచిది కాదు అని హెచ్చరించెను. వాలి తారను సముదాయించి, సుగ్రీవునితో యుద్ధము చేయనారంభించెను.ఆ యుద్ధము జరుగుతుండగా, వాలిని శ్రీ రాముడు ఒకే ఒక్క బాణముతో నిర్మూలించెను. (69)
తత: సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే|
సుగ్రీవ మేవ తద్రాజ్యే రాఘవ: ప్రత్యపాదయత్ || (70)
వాలిని వధించిన తరువాత, శ్రీ రామచంద్రుడు, సురీవుని మరలా కిష్కింధకు రాజుగా పట్టాభిషేకము చేసెను. (70)

Sunday, December 4, 2011
బాలకాండ శ్లోకాలు: 56-60 (ప్రథమ సర్గ)
తం నిహత్య మహాబాహు: దదాహ స్వర్గతశ్చ స: |
స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణిం || (56)
వికృతమైన రూపం కలిగిన ఈ రాక్షసుడిని, అద్భుతమైన శక్తి గల రాముడు త్రుటిలో సంహరించెను. ఆ రాక్షసుడు, స్వర్గలోకాలకు వెడలిపోతూ, రామునితో ఇల చెప్పెను. " ఓ రామా, ఈ అరణ్యములోనే శబరి అనే ఒక గొప్ప తపస్విని ఉన్నది" (56)
శ్రమణిం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ|
సోభ్యగచ్చన్ మహాతేజా: శబరీం శత్రుసూదన: || (57)
శబరి గురించి చెప్తూ, " ఆ మహా సాధ్వి, సత్య, దయా ధర్మాలకు కట్టుబడినదియై, నిత్యమూ దైవ స్మరణముతో గడిపే మహాత్మురాలు. ఓ రామా, నీవు ఆమె ఆశ్రమానికి వెళ్ళు" అని చెప్పి, కబంధుడు అద్రుశ్యమైయ్యెను. ఈ మాటలను విన్న రామచంద్రుడు, లక్ష్మణునితో కలిసి శబరి ఆశ్రమానికి బయలిదేరెను. (57)
శబర్యా పూజితస్సమ్యక్ రామో దశరథాత్మజ: |
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ || (58)
దశరధాత్మజుడైన రామచంద్రుని రాక చూసి, ఆయనని ఆహ్వానించి, అతిధి మర్యాదలు చేసెను. ఆ పంపా నది సమీపంలోనే రామునికి హనుమంతునితో పరిచయమయ్యెను. (58)
హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగత: |
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబల: || (59)
హనుమంతుని ద్వారా రామ లక్ష్మణులకు సుగ్రీవునితో పరిచయమయ్యెను. రాముడు సుగ్రీవునికి, హనుమంతునికి తన గాధనంతా వర్ణించెను. (59)
ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషత: |
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానర: || (60)
మోదటినుంచీ జరిగినదంతా వివరిస్తూ, సీతాపహరణమును వివరంగా వర్ణించెను. రాముడు చెప్పినదంతా సుగ్రీవుడు శ్రద్ధ గా విని, రామునితో స్నేహమునకు అంగీకరించెను. (60)

Monday, October 24, 2011
బాలకాండ శ్లోకాలు: 51-55 (ప్రథమ సర్గ)
న విరోధో బలవతా క్షమో రావణ తేన తే |
అనాదృత్య తు తద్వాక్యం రావణ: కాలచోదిత: || (51)
"ఓ రావణా, రామునితో వైరము నీకు అంత మంచిది కాదు. రాముని ధైర్య సాహసాలను తక్కువ అంచనావేసి నీ పతనాన్ని కొనితెచ్చుకోకు. నీ సహోదరి ఐన శూర్పణఖ మాటలు విని రామునితో యుద్ధానికి వెళ్ళిన మన పదునాలుగువేల మంది రాక్షసులను రాముడు అవలీలగా హతమార్చాడు. రామునితో వైరము నీకు కూడా అదే పరిస్థితిని తెచ్చిపెడుతుంది." ఇంతగా రావణాసురుడిని హెచ్చరించినా, మారిచుని మాటలను పెడచెవిన పెట్టాడు రావణాసురుడు. (51)
జగామ సహమరీచ: తస్యాశ్రమపదం తదా |
తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ || (52)
ఇలా రావణుడు, మారీచుని వెంట పెట్టుకుని రాముని ఆశ్రమానికి వెళ్ళెను. అక్కడ, రాజ కుమారులైన రామ లక్ష్మణులను, మారీచుని మాయచేత అడవిలోనికి పంపివేసెను. (52)
జహార భార్యాం రామస్య
గృధ్రం హత్వా జటాయుషం |
గృధ్రం చ నిహతం దృష్ట్వా
హృతాం శ్రుత్వా చ మైథిలీం || (53)
రామ లక్ష్మణులను ఆశ్రమానికి దూరంగా పంపివేశాక, రావణాసురుడు సీతను అపహరించి తీసుకుపోతుండగా, జటాయు రావణాసురుని బారినుండి సీతను కాపాడుటకు ప్రయత్నించెను. ఆ ప్రయత్నంలో జటాయు తీవ్రంగా గాయపడెను. సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త రామచంద్రమూర్తి జటాయువు ద్వారా తెలుసుకొనెను. (53)
రఘవశ్శోకసంతప్తో విలలాపాకులేంద్రియ: |
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం || (54)
సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త విని, రామచంద్రమూర్తి ఎంతో విలపించెను. తన ప్రాణానికి ప్రాణమైన భార్య తననుంచి దూరమైందన్న బాధతో రాముడు చాల విలపించెను. కొంత తేరుకున్న తరువాత, సీతను కాపాడుటకై ప్రయత్నించి తన ప్రాణాలను విడిచిపెట్టిన జటాయుకు రాముడు అంత్యక్రియలు చేసెను. (54)
మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ|
కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం || (55)
జటాయువుకు అంత్యక్రియలు చేసిన పిమ్మట, రామ లక్ష్మణులు సీతను వెతుకుతూ అడవులలోకి వెళ్ళెను. ఇలా అడవులలో తిరుగుతుండగా ఒక ఘోరమైన రూపం కలిగిన కబంధుడనే రాక్షసుడిని రామ లక్ష్మణులు చూసెను. (55)

Subscribe to:
Posts (Atom)